టాలీవుడ్ స్టార్ హీరో  మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి ఒక సినిమా తెరకెక్కుతుంది.. ఇక ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలతో రెండుసార్లు కలిసి పనిచేసిన ఈ ఇద్దరు ఇప్పుడు మూడవసారి మరో సినిమాను చేస్తున్నారు.అయితే ఇటీవలే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు. ఇది రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న మొన్నటి దాకా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇక ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెగ్యురల్ షూట్ కూడా

 మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసారు..  ఇక కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు మహేష్ కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే సెకండ్ షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్న సమయంలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ మరణించడంతో ఈ సినిమాకు పెద్ద బ్రేక్ పడింది. ఇదిలావుంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను డిసెంబర్ తొలి వారంలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట..

ఇక ఇదిలా ఉండగా మహేష్ సినిమాకు చరణ్, బోయపాటి వినయ విధేయ రామ సినిమాకు మధ్య కనెక్షన్ ఉంది అని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఇకపోతే  రెండవ షెడ్యూల్ షూట్ హైదరాబాద్ శివారులోని ఖాన్ పూర్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్లాన్ చేస్తున్నారట.. అయితే గతంలో వినయ విధేయ రామ సినిమా కోసం వేసిన సెట్టింగ్ ను అలాగే ఉంచారట.. ఇక ఇప్పుడు ఆ సెట్ కే చిన్న చిన్న మార్పులు చేసి పలు సినిమాల షూటింగ్ లకు ఉపయోగిస్తున్నారు..  మహేష్ సినిమాకు కూడా అక్కడే కీలక సన్నివేశాలు షూట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.. కాగా వినయ విధేయ రామ సినిమాకు వచ్చిన ఫలితం దృష్ట్యా ఈ సినిమాకు ఏమైనా బ్యాడ్ సెంటిమెంట్ వస్తుంది ఏమో అని మహేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: