బాలివుడ్ ఇండస్ట్రీలో  బాగా ఎక్కువగా వార్తల్లో నిలిచే జంటల్లో మలైకా అరోరా-అర్జున్ కపూర్ జంట ముందు వరుసలో ఉంటారు అని చెప్పొచ్చు ఇంతగా వీరి జంట జనాల నోళ్లల్లో నానడానికి ప్రధాన కారణం వీరిద్దరి మధ్య వయస్సు తేడా బాగా ఎక్కువ గా ఉందని..
మలైకాకు ఇంతకుముందే ఓ సంసారం, భర్త, పిల్లలు ఉండడమే. ఇద్దరి మధ్య 12 ఏండ్ల తేడా ఉన్నప్పటికీ కూడా నేటి తరం యువజంట తరహాలోనే ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ నైట్ పార్టీలకు అలాగే వివిధ రకాల సినిమా ఈవెంట్స్ లలో కూడా కలిసి కెమెరాలకు పోజులిస్తూ ఉంటారు. మొదట్లో తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచిన ఈ ఇద్దరూ తర్వాత చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే ఇటీవల తన ప్రియురాలు మలైకా అరోరా(49).. తల్లి కాబోతుందంటూ ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ ప్రచురించిన కథనంపై అర్జున్‌ కపూర్‌ (37) తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు. సదరు ఆర్టికల్‌ స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేసిన అర్జున్.. ''ఇంత కంటే దిగజారలేరు అనేంతగా వెళ్లిపోయారు. సెన్సిటివ్‌గా చూడాల్సిన విషయాన్ని అనైతికంగా ఎలాంటి రుజువులు లేకుండా రాసేశారు. ఇదొక చెత్త న్యూస్‌. ఇది సరైంది కాదు.. మా వ్యక్తిగత జీవితాలపై తప్పుడు వార్తలను ప్రచురించే ధైర్యాన్ని మీకు ఎవరు ఇచ్చారు'' అంటూ ప్రెగ్నెన్సీ వార్తలను  ఆయన ఖండించారు.

ఇలాంటి పనికిరాని వార్తల వల్ల మేం ఎంతలా ఇబ్బందిపడతామో మీకు అస్సలు తెలుసా? అంటూ ప్రశ్నించారు అర్జున్ కపూర్. ఇలాంటి వదంతులను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఆ విలేకరి తరచూ ఇటువంటి వార్తలనే రాస్తున్నారని , అవి కాస్త సోషల్‌మీడియాలో  బాగా ట్రెండ్‌ అయ్యి అందరూ వాటిని నిజాలే అని నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటివి చేయడం మానేయాలని, వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మలైకా అరోరా కూడా తన ప్రెగ్నెన్సీ వార్తలపై ఘాటుగానే స్పందించింది. అర్జున్ కామెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన మలైక కూడా తీవ్ర పదజాలంతో ఈ వార్తలను ఖండించింది. 2017లో అర్బజ్ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్న మలైకాకు అర్జున్‌ కపూర్‌తో పరిచయం ఏర్పడింది. ఎంతోకాలం నుంచి రిలేషన్‌లో ఉన్న వీరిద్దరూ గతేడాది తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: