ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నటులలో సత్యదేవ్ ఒకరు. సత్యదేవ్ సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలో నటిస్తూనే , హీరో పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే సత్యదేవ్ అనేక సినిమాలలో ముఖ్య పాత్రలో నటించడం మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో హీరో గా నటించి కూడా ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ శేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. కాల భైరవమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సత్యదేవ్ గుర్తుందా సీతాకాలం మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా సత్యదేవ్ మాట్లాడుతూ ... ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు. గుర్తుందా సీతాకాలం మూవీ ఈ జనరేషన్ కు గీతాంజలి మూవీ అన్నట్టు ఉంటుంది. ఈ మూవీ లో నాలుగు డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఫోర్ పేజెస్ ఆఫ్ లవ్. ఈ నాలుగు ఫెజ్ స్ అయిపోయిన వాళ్లు కూడా ఉంటారు. ప్రెసెంట్ ఆ ఫేజ్ రన్ అయ్యే వాళ్లు కూడా ఉంటారు. అందరికీ కూడా ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిలిం ఎవరు చేయలేరేమో నాకు తెలిసి అని సత్యదేవ్ తాజాగా చెప్పుకొచ్చాను. ఈ మూవీ తో సత్యదేవ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: