టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శైలేష్ కొలను హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇలా హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో , ఈ మూవీ ని హిందీ లో ఇదే పేరుతో దర్శకుడు శైలేష్ కొలను రీమేక్ చేశాడు. కాకపోతే ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా శైలేష్ కొలను "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. అడవి శేషు ఈ మూవీ లో హీరో గా నటించిన , మీనాక్షి చౌదరి మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడం తో ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని నందమూరి నటసింహం బాలకృష్ణ చూసిన విషయం మనకు తెలిసింది.  తాజాగా మరో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీ ని చూశాడు. ఈ సందర్భంగా ఈ మూవీ దర్శకుడు శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా ... వెంకీ సార్ కు మూవీ నచ్చినందుకు ఆనందంగా ఉంది. వెంకీ సార్ మూవీ చూస్తూ చాలా టెన్షన్ పడ్డాడు అని శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: