అంతేకాదు కంటెంట్ ఉన్న చిత్రాలను ఏ భాషా ప్రేక్షకుడైన ఆదరిస్తాడని చెప్పడానికి ఈ సినిమా నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే బసిల్ జోసెఫ్, దర్శన్ రాజేంద్రన్ జంటగా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లలో విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ కూడా బయటకు రావడం గమనార్హం. ఈ సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు ఓటీటీ లోకి కూడా రాబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే డిసెంబర్ 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వివిధ భాషలలో ఈ చిత్రం ప్రసారం కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మలయాళం లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓ టీ టీ ద్వారా ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా 42 రోజుల్లో పూర్తి చేసి అక్టోబర్లో విడుదల చేశారు. పలువురు ప్రశంసలు అందుకుంటున్న ఈ చిన్న సినిమా ఓటీటీ లో ప్రసారం కానుంది. మరోపక్క ఒక తెలుగు బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకొని త్వరలోనే తెలుగులో డబ్ చేసి థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి