నిఖిల్ ‘కార్తికేయ 2’ తరువాత నటిస్తున్న ’18 పేజెస్’ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఒక క్యూట్ లవ్ స్టోరీలో నిఖిల్ హీరోగా నప్పుతాడ అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. అయితే ఇది పూర్తి లవ్ స్టోరీ మూవీ కాదు అన్న క్లారిటీ వస్తూ ఉండటంతో ఈమూవీతో మళ్ళీ నిఖిల్ మరొక హిట్ కొట్టబోతున్నాడ అన్న అంచనాలు కూడ వస్తున్నాయి.


ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న సూర్య ప్రతాప్ ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ కావడంతో ఈమూవీ కథలో కూడ కొన్ని ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి అని అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈమూవీ ప్రమోట్ చేస్తూ సూర్య ప్రతాప్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈమూవీలో ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఉండబోతోంది అంటూ దర్శకుడు పెంచుతున్న అంచనాలను బట్టి ఈమూవీ క్లైమాక్స్ ‘ఉప్పెన’ స్థాయిలో ఉంటుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.


అయితే ఈవిధంగా ఈమూవీ పై మరీ అంచనాలు పెంచుతూ ప్రమోట్ చేయడం కూడ ఒకవిధంగా నష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సినిమా పై ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు ధియేటర్లలోకి వచ్చినప్పుడు ఆసినిమా లోపాల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే భారీ అంచనాలతో విడుదలైన సినిమాలో ఏమాత్రం తేడా కనిపించినా ఆమూవీ ఫలితం పై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది.


దీనితో ’18 పేజస్’ క్లైమాక్స్ నిజంగానే డిఫరెంట్ గా ఉంటే ఆమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో సినిమా క్లైమాక్స్ ఏమాత్రం డిఫరెంట్ గా కనిపించినా ప్రేక్షకులు ఆసినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ లో వెరైటీ కనిపించకుండా రొటీన్ పోకడలు కనిపిస్తే మటుకు ఆసినిమా పై పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ’18 పేజస్ ఫలితం నిఖిల్ కెరియర్ కు మరో మలుపు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: