టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏం మాయ చేసావే సినిమాతో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమె దాని అనంతరం వరస సినిమాలు చేస్తూ వేలకోట్ల ఆస్తులను కూడబెట్టినట్లుగా తెలుస్తుంది ల.లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తోంది సమంత. అయితే సమంతకి సంబంధించి ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఇప్పుడు నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత దగ్గర ఎంత ఆస్తి ఉంది అని చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. 

నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత వారిద్దరూ కలిసి ఉన్న అదే ఇంటిని కొనుక్కొని అందులోనే ఉంటున్నట్లు గతంలో అనేక రకమైన వార్తలు వచ్చాయి. ఇక ఆ ఇల్లు ఖరీదు ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అని సమాచారం.  సమంత సినిమాలే కాకుండా తన స్నేహితులతో కలిసి బిజినెస్ను కూడా చేస్తుంది. వ్యాపారం మాత్రమే కాదు ఒక ప్లే స్కూల్ ను కూడా నడుపుతుంది సమంత. వీటితోపాటు సాకీ దుస్తుల బ్రాండ్ ను కూడా నడిపిస్తుంది. దీని ద్వారా సమంతకి బాగానే లాభం వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవే కాకుండా సమంత చారిటీ ఫౌండేషన్ కూడా నడుస్తుంది.

తెలుగుతోపాటు తమిళం మరియు బాలీవుడ్ లో కూడా సమంత సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది సమంత. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2022 వరకు సమంత దగ్గర 97 కోట్లు దాకా ఉన్నాయని తెలిసింది. ఇక ఆమె వార్షిక ఆదాయం నెలకు దాదాపు 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.ఇక ఆమె సోషల్ మీడియా ద్వారా 10 నుండి 20 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందట. ప్రస్తుతం సమంత ఒక్క సినిమాకి గాను నాలుగు నుండి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. వీటన్నిటితోపాటు సమంతకి బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్ తో పాటు మరికొన్ని లగ్జరియస్ కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోనే కాకుండా సమంతకి ముంబై మరియు చెన్నైలో కూడా ఖరీదైన ఇల్లు ఉన్నాయి. విడాకుల అనంతరం సమంత నాగచైతన్య దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: