ఆహా లో ప్రసారం అవ్వుతున్న ‘అన్ ష్టాపబుల్’ షోకు క్లైమాక్స్ గా మారిన బాలయ్య పవన్ లకు సంబంధించిన టీజర్ విడుదలైన కొన్ని నిముషాలలోనే వైరల్ గా మారింది. రిపబ్లిక్ డే నుండి స్ట్రీమ్ కాబోతున్న ఈషోకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తుందని ఆహా టీమ్ అంచనాలు వేస్తోంది.ఎపిసోడ్ పై మరింత అంచనాలు పెంచడానికి బాలకృష్ణ పవన్ ను టార్గెట్ అడిగిన ప్రశ్నను ప్రసారం చేస్తున్నారు. ‘తెలుగు రాష్ట్రాలలో మీ అభిమాని కాని వాడు లేడు. కానీ ఆ ప్రేమ ఓట్ల‌గా ఎందుకు మార‌లేదు’ అని అడిగిన ప్ర‌శ్న‌ను బాల‌య్య సూటిగా పవన్ ను ప్రశ్నించాడు. వాస్తవానికి తెలుగుప్రజల అందరి మనసులలోను ఈ ప్రశ్న ఉంది. దీనితో ఈ ప్రశ్నకు పవన్ ఎలాంటి జవాబు ఇవ్వబోతున్నాడు అన్న ఆశక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.అంతేకాదు ఈ షోలో పవన్ చిన్నతనంలో సరిగ్గా చదువుకోని సమయంలో చిరంజీవి పవన్ ను విపరీతంగా మందలించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు పవన్ హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని యుక్త వయసులో అనుకున్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలు కూడ ఉంటాయని లీకులు వస్తున్నాయి. దీనితో ఈషో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందా అంటూ పవన్ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు వారందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సంచలనాలు మరెన్నో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలవల్లె పవన్ ను అతడి ప్రత్యర్థులు చాల సులువుగా టార్గెట్ చేస్తున్నారు. తన పై ప్రత్యర్ధులు చేసే విమర్శలు పెరిగే కొద్ది తాను మరింత స్ట్రాంగ్ గా మారి గోడకు కొట్టిన బంతిలా చాల వేగంగా ముందుకు వస్తాను అంటూ పవన్ ఓపెన్ గానే చెపుతున్నాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఓట్లు చీలిపోకుండా తన జనసేన ను అధికారానికి దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాలకు ఈ షో ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: