
ఇటీవల కాలంలో అటు ప్రేక్షకుల ముందుకు ఏ సినిమా వచ్చినా ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ బుల్లితెరపై టాప్ రేటింగ్స్ సొంతం చేసుకునే షోలలో నిర్వహించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే సుమ అడ్డ అనే కార్యక్రమంలో ఇటీవల ఎన్నో సినిమాలకు సంబంధించిన నటీనటులు ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. ఇక ఇటీవల సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమాకు సంబంధించిన చిత్రం ముందు ప్రమోషన్స్ కోసం వచ్చారు అని చెప్పాలి.
సాధారణంగా సుమ షో అనగానే ఇక ఏదో ఒక కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ని తన షోకి పిలిపించడం.. ఆసక్తికర ప్రశ్నలు అడిగి స్పాంటేనియస్ పంచులతో ఎంటర్టైన్మెంట్ పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా ఎవరు ఎక్కువ అబద్ధాలు చెబుతారు అంటూ సుమా ప్రశ్న అడగగా ఆడవాళ్లే అబద్ధాలు ఎక్కువ చెబుతారని ఒక స్టూడెంట్ చెబుతాడు. ఇక వెంటనే అందుకున్న మరో అమ్మాయి ఒక పెగ్గు తాగి ఊగిపోయే నువ్వు అబద్దాల గురించి మాట్లాడుతున్నావా మగవాళ్ళు ఎక్కువ అబద్దాలు చెబుతారు అంటూ రౌడీ లాగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో భయపడి పోయిన సుధీర్ బాబు ఆ అమ్మాయికి సంతకం చేయకపోతే నన్ను కూడా ఏదో ఒకటి అంటుంది అంటూ చివరికి ఆటోగ్రాఫ్ ఇచ్చేసాడు.