ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయా హాస్పిటల్ లో తారకరత్నకు పదిమంది ప్రత్యేకమైన వైద్య బృందంతో చికిత్స జరుగుతుంది. ఎక్మో సపోర్ట్ తోనే తారకరత్నకు ట్రీట్మెంట్ జరుగుతోందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా కార్డియాలజిస్ట్ లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా మారుతుంది అంటూ వైద్యులు తెలిపారు. నిజానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని..అయితే ఏ విషయం తెలియాలి అంటే 48 గంటల వరకు ఎదురు చూడాల్సిందే అంటూ కూడా తెలుపుతున్నారు.

తారకరత్నను చూడడానికి ఆయన సోదరులు ఇవాళ బెంగళూరుకి బయలుదేరుతున్నారు.  కళ్యాణ్ రామ్,  జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు  కూడా బెంగళూరు నారాయణ హృదయాల హాస్పిటల్ కు బయలుదేరారు.. ఉదయం 10:30 గంటలకు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ .. తారకరత్న ఉంటున్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చేరుకోబోతున్నారు. నిన్న తారకరత్నను చూడడానికి నందమూరి కుటుంబ సభ్యులు,  చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. తారకరత్న కుటుంబ సభ్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అంత బాగోలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు వచ్చింది కేవలం గుండెపోటు మాత్రమే కాదు జీర్ణశయానికి సంబంధించిన మెలేనా అనే అరుదైన వ్యాధి కూడా. ఈ వ్యాధి ఉన్నవారికి గుండెపోటు వస్తే చికిత్స చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. రక్తమార్పిడి చేయడానికి కూడా గుండె ప్రస్తుతం సహకరించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కృత్రిమంగా గుండె కదలికకు ఏర్పాట్లు చేశారు వైద్యులు.  ఏది ఏమైనా ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా తెగ ఆరాటపడుతున్నారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత మీడియాతో కళ్యాణ్ రామ్,  జూనియర్ ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: