వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన లాయర్ ద్వారా ఒక ప్రకటనని చేయించాడు. ఆ ప్రకటనలో రజినీకాంత్  ఫొటోలను ఇంకా అలాగే వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు.రజినీకాంత్  ఫొటోలను ఇంకా వీడియో లను అనుమతి లేకుండా ఎవరు పడితే వారు ఉపయోగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇటీవల కొంతమంది వ్యక్తులు రజినీకాంత్ వీడియోలను ఇంకా ఫొటోలను దుర్వినియోగం చేసి జనాలను మోసం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట. దాంతో రజినీకాంత్ తన లాయర్ ద్వారా ఈ ప్రకటన చేయించడం జరిగిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. రజినీకాంత్  ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తన ఫొటోలు, వీడియోలను ఇంకా అలాగే ఆడియోలను వినియోగిస్తున్న వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలకు రజినీకాంత్ రెడీ అవుతున్నాడని.. అలాగే ముందు ముందు ఎవరైనా తన పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తే కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటూ హెచ్చరించారు.


ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ సినిమా లో  నటిస్తున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలుగా రజినీకాంత్ నుంచి ఒక మాస్ హిట్ లేక అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కు జైలర్ సినిమా సక్సెస్ ను తెచ్చి పెడుతుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి చూడాలి జైలర్ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..రజినీకాంత్ కి దర్బార్ సినిమా తప్ప హిట్ లేదు. అదే ఆయన ఆఖరి హిట్ సినిమా. ఆ సినిమా తరువాత అన్నాతే సినిమా చేసినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రజినీ మార్క్ హిట్ ని అందుకోలేకపోయింది. ఇక జైలర్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: