ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలం నుంచి  ఎక్కడ చూసినా ఒక సినిమా పేరు మారుమ్రోగిపోతుంది.ఆ సినిమానే కన్నడ సినిమా కాంతారా. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని ఒక రేంజిలో షేక్ చేసింది.అసలు ఎలాంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా దేశావ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంటుంది.ఇక ఈ సినిమాని అన్ని భాషల్లో కూడా డబ్ చేసి ఆ సినిమాలోని కన్నడ నేటివిటీని అందరికీ పరిచయం చేశాడు రిషిబ్ శెట్టి. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండటం వల్ల  ఎన్నో రికార్డులను చాలా అవలీలగా బద్దలు కొట్టాడు రిషిబ్ శెట్టి. స్వయంగా ఆయనే డైరెక్ట్ చేసిన కాంతారా సినిమా రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ సువర్ణ ఛానల్ లో టెలికాస్ట్ అయింది.అయితే ఈ సినిమాకి కన్నడలో ఇప్పటివరకు ఎన్నడూ కూడా ఏ సినిమా అందుకొని విధంగా ఏకంగా 15.8 టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది.


కన్నడ సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న సినిమాగా కాంతారా సినిమా రికార్డును నెలకొల్పింది. అయితే ఇప్పటివరకు అంటే కాంతారాకి ముందు హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకున్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గత ఏడాది విడుదలైన కేజీఎఫ్ సినిమా 10.2 టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంది. తెలుగు వర్షన్ లో కూడా 9.3 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.అయితే కె జీ ఎఫ్ నెలకొల్పిన టిఆర్పి రేటింగ్స్ ను తుక్కుతుక్కు చేసి నమిలి మింగేసింది కాంతారా సినిమా. ఏకంగా 15.8 టిఆర్పి రేటింగ్ రికార్డ్ చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది . కేవలం 16 కోట్ల బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 470 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు బాలీవుడ్ లెక్కలు చెబుతున్నాయి . అంతేగాక కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలో మరో సరి కొత్త చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: