కమలహాసన్ వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న పరిస్థితులలో అతడి కెరియర్ ముగిసిపోయింది అని భావించిన తరుణంలో గత సంవత్సరం విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 4వందల కోట్లు కలెక్ట్ చేయడంతో కమలహాసన్ మ్యానియా ఇంకా ఈతరం ప్రేక్షకులలో కూడ ఉంది అన్నవిషయం రుజువైంది. ఇప్పుడు అదే సీన్ వెనక్తేష్ విషయంలో కూడ రిపీట్ కాబోతోందా అన్నసందేహాలు కలుగుతున్నాయి.ఒకప్పుడు వెంకటేష్ మూవీ అంటే మినిమం గ్యారెంటీ హిట్ అన్నఅంచనాలు ఇండస్ట్రీలో ఉండేవి. టాప్ యంగ్ హీరోల మ్యానియా పెరిగిపోవడంతో ఈనాటి తరం ప్రేక్షకులకు వెంకటేష్ సినిమాలు పెద్దగా కనెక్ట్ అవ్వడం లేదు అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ ను తిప్పికొట్టడానికి వెంకీ చేస్తున్న ప్రయోగం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శైలేష్ కొలన్ దర్శకత్వంలో ‘సైంధవ్’ అన్న టైటిల్ తో ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈమూవీ భారీ బడ్జెట్ తో తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తమిళ నటుడు ఆర్య ఈమూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేస్తున్న ఈమూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈమూవీ కథ కొన్ని చోట్ల కమలహాసన్ విక్రమ్ మోవీ ఛాయలలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ చాలా రోజులుగా తన 75వ సినిమాకు సంబంధించి సరైన కథ దొరక్క ఖాళీగా ఉండటం జరిగింది.అతడు ఎన్ని కథలు విన్నా నచ్చలేదు అని అంటారు. ‘హిట్ 2’ సూపర్ సక్సస్ తో మంచి పేరు తెచ్చుకున్న శైలేష్ ను నమ్ముకుని వెంకీ ఈ ప్రయోగం చేస్తున్నాడు. వెంకటేష్ ఇప్పటివరకు నటించిన ఎసినిమాకు ఈ స్థాయిలో భారీ బడ్జెట్ ఖర్చుపెట్టలేదు. దీనితో టాప్ హీరోల మధ్య పెరిగిన పోటీ మధ్య వెంకీ తాను కూడా నిలబడడానికి గట్తో ప్రయత్నమే చేస్తున్నాడు అనకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: