షారుక్ ఖాన్ హీరో గా నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. నెగిటివ్ ప్రచారంతో మొదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నది. షారుఖ్ ఖాన్ నుంచి 4 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంతకుమించి నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియా లో పఠాన్ సినిమా పైన ఎక్కువగా కొనసాగింది.

ఇక ఈ సినిమాని కొంతమంది బ్యాన్ చేయాలంటూ కూడా ట్రెండ్ చేశారు. వీటన్నిటిని దాటుకొని ప్రేక్షకులు ముందుకు పఠాన్ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో మంచి విజయాన్ని అందుకుంది. షారుక్ ఖాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.800 కోట్ల రూపాయల మార్కుని అందుకుంది.. ఇక రెండో వారంలో అడుగుపెట్టిన కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. కేవలం తొమ్మిది రోజులలో ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల రూపాయలు కలెక్షన్ ను సొంతం చేసుకుంది.

అయితే ఇప్పటికీ కూడా ఈ మూవీస్ ఆదరణ లభిస్తూ ఉండడంతో కచ్చితంగా రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి
 ఈ సినిమా హిందీ మూవీగా సౌత్ ఇండియా లో పలు సంచలనాలను క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. తెలుగులో ఈ సినిమా సుమారుగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఏదేమైనా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ క్రేజ్ ని ఈ సినిమా మరొకసారి అమాంతం పెంచేసిందని చెప్పవచ్చు బాలీవుడ్ హీరోలకు పఠాన్ సినిమా కాస్త ఊపిరి పోసిందని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: