టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకోని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సందీప్ కిషన్. స్నేహ గీతం సినిమాతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్ ఆ తర్వాత  మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా నటించి తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.అయితే తర్వాత హీరోగా ఇండస్ట్రీలో కొంచెం నిలదొక్కుకోడానికి ప్రయత్నం చేశాడు కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేక ఇప్పటికీ ప్లాపుల్లోనే ఉన్నాడు. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే కేవలం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా మాత్రమే అని చెప్పాలి.తాజాగా సందీప్ కిషన్ మైఖేల్ అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టి పెద్ద స్టార్ అవ్వాలని తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు.ఈ మధ్య కాలంలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలకు బాగా హిట్ అవ్వడంతో తాను కూడా అలాంటి కథని పీరియాడిక్ జోన్లోని తీసుకొని మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.


అయితే ఈ సినిమాకు మొదటిరోజే నెగిటివ్ టాక్ రావడం పెద్ద దెబ్బ అయ్యింది. ఈ సినిమాని సందీప్ కిషన్ kgf మూవీస్ చూసి కాపీ కొట్టి ఫెయిల్ అయ్యాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ కథ అయినా ఎమోషనల్ ఎలిమెంట్స్ లో ప్రేక్షకులు కన్విన్స్ చేయాలక దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అందువల్ల సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేక కాపీ మూవీ అనే ట్రోల్స్ ఎదురుకుంటుంది. kgf ని కాపీ కొట్టి kgf రేంజిలో హిట్ కొట్టాలనుకున్న సందీప్ కి ఆ రేంజిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.దీంతో మరోసారి అతని అపజయాల పరంపర తగ్గకుండా ఇంకా కొనసాగుతున్నట్లు అయింది.ఈ సినిమా చేసి తాను పెద్ద తప్పు చేసానే అని సందీప్ కిషన్ ఫీలవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక తరువాత సినిమాతో అయిన సందీప్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: