షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం తగ్గకుండా ఒకదాని తర్వాత మరొక కలెక్షన్లతో బెంచ్ మార్పును సాధిస్తోంది .ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఇక విలన్ గా జాన్ అబ్రహం నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ .1000 కోట్ల క్లబ్లో చేరేందుకు ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది. సెన్సేషనల్ ఫస్ట్ వీకెండ్ తర్వాత సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమా మంచి పట్టును కొనసాగిస్తూ ఉంటోంది .ఇప్పటివరకు దాదాపుగా రూ.850 కోట్లకు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.


సినిమా ఇప్పటికే దంగల్ సినిమా కలెక్షన్స్ను దాటి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నది.ఈ చిత్రం ప్రతి ప్రాంతంలో కూడా ఒక కొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేస్తుందని ఎవరు ఊహించుకోలేకపోయారు. ఇక ఊహించని స్థాయిలో రికార్డులను సైతం సృష్టించింది ఈ చిత్రంలో షారుక్ ఖాన్ అద్భుతంగా నటించారని చెప్పవచ్చు చాలాకాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్కు రప్పించి బాలీవుడ్లో కి కాస్త ఊపిరి పోశారు.


పఠాన్ సినిమా జనవరి 25న ఈ ఏడాది ఒకేసారి హిందీ తెలుగు, తమిళ్ భాషలలో విడుదల అయింది ఈ చిత్రాన్ని యశ్ రాజు ఫిలిం సమర్పణలు విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రం తమ హీరో రేంజ్ ఇదే అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: