మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమా లకు దూరంగా ఉండి మళ్లీ తిరిగి ఖైదీ నెంబర్ 150 మూవీ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బ్లాక్ బాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి మూవీ తో మంచి విజయం అందుకున్న చిరంజీవి పోయిన సంవత్సరం విడుదల అయిన ఆచార్య ... గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్ లో అలరించలేక పోయాడు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకదా జనవరి 13 వ తేదీన విడుదల అయిన వాల్తేరు వీరయ్య మూవీ తో చిరంజీవి ప్రేక్షకులను పలకరించాడు. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... బాబీ సింహా ... ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలలో నటించారు.

మూవీ విడుదల ఇప్పటికీ అవి ఇప్పటికి 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 24 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 135.77 కోట్ల షేర్ , 231.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 89 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. దానితో ఈ మూవీ కి 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 46.77 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: