శ్రీను వైట్ల మొదటి సినిమా గా వచ్చిన నీకోసం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా మెప్పించ లేదు.ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకి గాను శ్రీను వైట్ల కి నంది అవార్డు కూడా వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత తీసిన ఆనందం సినిమా మంచి విజయం సాధించి శ్రీను వైట్లకి కమర్షియల్ విజయం అందించింది...ఇక ఈ సినిమా తరువాత ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఈ సినిమాలో కామెడీ ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

ఇక మూడవ సినిమా అయినా వెంకీ సినిమా కోసం రైటర్ కోన వెంకట్ ని రవి తేజ శ్రీను వైట్ల కి పరిచయం చేసాడని తెలుస్తుంది..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ఇక దాంతో కోన వెంకట్ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చాయి.వరుసగా ఢీ, దుబాయ్ శ్రీను, రెడీ, కింగ్, నమోవెంకటేశ, దూకుడు మరియు బాద్షా లాంటి వరుస హిట్ సినిమాలు కూడా వచ్చాయి.బేసిగ్గా శ్రీను వైట్ల మూవీ అంటే రైటర్లు గా కోన వెంకట్, గోపిమోహన్ లు కూడా ఉంటారు అలా వాళ్ళు రాసిన కథ కి, డైలాగ్స్ కి శ్రీను వైట్ల కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని అన్నింటికీ తన పేరు వేయించుకోవడం తో కోన వెంకట్ కి శ్రీను వైట్ల కి మధ్య గొడవలు కూడా జరిగాయి.


 దాంతో కోన వెంకట్ శ్రీను వైట్ల కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేసాడట.చరణ్ సినిమాతో చిరంజీవి వీళ్ళిద్దరిని కలిపినప్పటికీ వాళ్ల మధ్య ఉన్న మనస్పర్థలు మాత్రం తొలిగిపోలేదు అనేది ఆ సినిమా ని చూస్తే నే మనకు తెలుస్తుంది. కోన వెంకట్ తన అసిస్టెంట్స్ అయినా బాబీ మరియు హరీష్ శంకర్ సినిమాలకి వర్క్ చేసుకుంటూ మిగిలిన ఇంకా కొన్ని సినిమాలకి డైలాగ్స్ రాసుకుంటూ సినిమాల్లో చాలా బిజీ గా ఉంటున్నప్పటికీ, శ్రీను వైట్ల మాత్రం సినిమాలు లేక ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారట.శ్రీను వైట్ల ని చూసిన సినీ పెద్దలు అందరూ ఒకరి క్రెడిట్ ని మనం వాడుకొని వాళ్ళకి అన్యాయం చేస్తే మనకు కూడా ఏదో ఒక రోజు అన్యాయం జరుగుతుంది అని శ్రీను వైట్ల ను చూసి సినీ పెద్దలు అనుకుంటున్నారు.…

మరింత సమాచారం తెలుసుకోండి: