నేనింతే సినిమాలో ఇండస్ట్రీ లో సాధారణ పరిస్థితులు మంచి చెడులపై సెటైరికల్ సబ్జెక్టుతో తెరకెక్కించారు. నేనింతే చిత్రంలో సియా గౌతమ్ హీరోయిన్ కావాలని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అమ్మాయి పాత్రలో నటించింది. రవితేజ ఇందులో డైరెక్టర్ పాత్రలో నటించారు. ఇక నేనింతే సినిమా పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత ఈమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమి రాలేదు. చిన్న చిన్న పాత్రలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది ఆ తర్వాత వేదం సినిమాలో ఒకరోల్ లో నటించినట్లు తెలుస్తోంది.కన్నడలో కూడా ఒక సినిమాలో నటించి నట్లు తెలుస్తోంది. సంజయ్ బయోపిక్ సంజు మూవీలో కూడా కీ రోల్ లో నటించినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత పక్కా కమర్షియల్ మూవీలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక నిన్నటి రోజున ఈమె వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి ముంబై వేడుకలు ఈమె వివాహం జరిగినట్లుగా తెలుస్తున్నది. సియా భర్త పేరు నిఖిల్ పాల్కే వాళ్ అని సమాచారం. ఇతడు ముంబైలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త అన్నట్లుగా తెలుస్తోంది పెద్దలు కుదిరిచిన వివాహమా లేక లవ్ మ్యారేజ్ అన్న విషయం ఇంకా తెలియదు. కొంత అది సినీ ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి