తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఆర్సి15 అనే ఒక వర్కింగ్ టైటిల్ పెట్టి సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన పాటలను కూడా భారీ రేంజ్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు.


ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు ఈ సినిమాలో రెండు పాటల కోసం పెట్టిన ఖర్చు ఏకంగా 2 మీడియం సైజు బడ్జెట్ చిత్రాలను సులభంగా తీయవచ్చు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల మధ్య చిత్రీకరించిన తాజా పాట యుగళగీతం.. ఈ పాట చిత్రీకరణ కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరొకవైపు పాతబస్తీలో కూడా ఒక పాటను చిత్రీకరించారు ఈ పాట కోసం కూడా దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేశారట.

దిల్ రాజు ఈ పాటల సీక్వెన్స్ ల కోసం వెచ్చించే బడ్జెట్ తో కచ్చితంగా 2 మీడియం సైజు బడ్జెట్ చిత్రాలను సులభంగా తీయవచ్చు అంటూ ఇప్పుడు వార్తలు బాగా వైరలవుతున్నాయి . భారీ బడ్జెట్లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాలేదు. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని అనుమానాలు కూడా అభిమానులలో కలుగుతున్నాయి.  నిజంగా ఈ సినిమా రామ్ చరణ్ కు ప్రెస్టేజ్ తో కూడుకున్నది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా రామ్ చరణ్ కు ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: