బుల్లితెర హాట్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కామెడీ షో తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన అందం, అభినయంతో యాంకరింగ్ రంగంలో భారీ గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పుడు అటు వెండితెరపై సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ అండ్ చెందాలను చూపిస్తూ కుర్రకారుల మతులు పోగోడుతూ ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటుంది. రష్మీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. 

అందుతున్న సమాచారం ప్రకారం రష్మి గౌతమ్ కి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రష్మీ కూడా ఇందుకు రెమ్యూనరేషన్ భారీగా అడుగుతుందట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రష్మీ కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్టుగా దగ్గుబాటి హీరో రానా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించగా.. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ పేరు కూడా బాగా వినిపిస్తోంది.

ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కి ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత సీజన్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి కాస్త ఫేమ్ ఉన్న సెలబ్రిటీలను తీసుకురాబోతున్నారట బిగ్ బాస్ టీం. ఈ క్రమంలోనే ఇప్పటికే బుల్లితెర టాప్ యాంకర్ రష్మీ ఈ లిస్టులో మొదటగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రష్మి తో పాటు ఇంకా ఎవరెవరు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: