ఆధార్ సెంటర్లో సూపర్ స్టార్.. పిక్ వైరల్?

దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆధార్ ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడం జరిగింది. స్టార్స్ కు సెలబ్రెటీలకు ఇంకా అలాగే నాయకులకు అందరికి కూడా ఇప్పటికే ఆధార్ కార్డులు ఉన్నాయి.అయితే టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇన్నాళ్లు ఆధార్ కార్డ్ ను తీసుకోలేదు అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.ఇప్పుడు ఈ టాక్ రావడానికి కారణం ఏంటంటే తాజాగా హైటెక్ సిటీ దగ్గరలోని దుర్గం చెరువులో ఆధార్ వెరిఫికేషన్ ఆఫీస్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్లాడు. అక్కడ మహేష్ బాబు ఆధార్ కార్డ్ కోసం వేలి ముద్ర వేయడంతో పాటు ఐరిష్ వెరిఫికేషన్ ని కూడా చేయడం జరిగింది.ఆధార్ కార్డు సెంటర్ లో మహేష్ బాబు సందడి చేయడంతో సోషల్ మీడియాలో ఇన్నాళ్లు మహేష్ బాబుకు ఆధార్ కార్డు లేదా అని ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉన్న మహేష్ బాబు పాన్ కార్డు.. బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.పైగా ఆ రెంటిని కూడా తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా మహేష్ బాబు గతంలోనే ఆధార్ కార్డును కలిగి ఉంటాడు. అయితే ఏదైనా చిన్న చిన్న మార్పుల నిమిత్తం ఆధార్ సెంటర్ ను మహేష్ బాబు సందర్శించి ఉంటాడు ఫ్యాన్స్ అభిప్రాయం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: