నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద తదితర వంటి చిత్రాలతో దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించారు. అయితే ఇప్పుడు తాజాగా నాగశౌర్య హీరోగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతున్నది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తున్నది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నాగశౌర్యకు గత ఏడాది విడుదలైన కృష్ణ బృందా విహారి చిత్రం పరవాలేదు అనిపించుకుంది.


తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ మరియు పద్మజా దాసరి నిర్మిస్తూ ఉన్నారు. మేఘ చౌదరి, అభిషేక్ మహర్షి, శ్రీ విద్యాలతో పాటు అవసరాల శ్రీనివాస్ కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్సినిమా కోసం ఈసారి కొత్త టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఒకటి రెండు సినిమాలకు వాడిన పద్ధతిని అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది.


అదేమిటంటే అదే స్పాట్ డబ్బింగ్ పవన్ కళ్యాణ్ జానీ, తీన్మార్ సినిమాలకు ఈ విధంగానే స్పాట్ డబ్బింగ్ పద్ధతిని ఉపయోగించారు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సపరేట్గా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకోకుండా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్పాట్ గా డబ్బింగ్ ఇవ్వడాన్నే స్పాట్ డబ్బింగ్ అంటారు. అవసరాల శ్రీనివాస్ కూడా ఈ విషయంలో ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ 2019లోనే మొదలయింది. కానీ కొన్ని కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది ఫైనల్ గా ఈ సినిమా నాలుగేళ్ల తర్వాత ఈనెల 17వ తేదీన అది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: