పవన్ కళ్యాణ్ హీరోగా  తమిళ సూపర్ హిట్ మూవీ అయిన వినోదయ సీతం రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో సముద్ర ఖని దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా కు రచన సహకారం కూడా అందించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది. అన్ని అనుకున్నట్లుగా కనుక జరిగితే ఈ సినిమా ను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా అవకాశం కూడా ఉందట.. రోజుకు రెండు కోట్ల రూపాయలను ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నానని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఇక ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు.

ఉగాది సందర్భం గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రాబోతుందని తెలుస్తుంది. అభిమానులకు ఆశ్చర్యం కలుగ చేసే విధంగా ఉగాది కి సినిమా టైటిల్ ని రివీల్ చేయడం తో పాటు పవన్ కళ్యాణ్ యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భావిస్తున్నట్లు సమాచారం..

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా కేవలం 30 రోజుల్లోనే సినిమా ను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో 30 రోజుల్లో సినిమా అంటే ఎలా ఉంటుందా అంటూ కొందరు అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.. కానీ ఈ సినిమా ఎక్కువ రోజులు తీయాల్సిన అవసరం అయితే రాలేదని చిత్ర యూనిట్ సభ్యులు కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని మరింత గా పెంచే సినిమా అవుతుంది అంటూ కూడా మేకర్స్ దృఢం గా వున్నారట.ఉగాది కి వచ్చే సర్ప్రైజ్ తో సినిమా పై అంచనాలు పెరుగుతాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: