యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తను నటిస్తున్న సినిమాలన్నీ కూడా విభిన్నమైన జోనల్లోనే చేస్తూ ఉన్నారు. ఫలక్నామాదాస్ సినిమాతో మొదటిసారిగా దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరొకసారి తన దర్శకత్వంలోనే దమ్కీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఒక్క సినిమా విడుదల అవుతూ ఉంటే మరో చిత్రానికి నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది ఇది విశ్వక్సేన్ పదవ చిత్రం.ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు తన 10వ చిత్రాన్ని చేస్తున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా ద్వారా దర్శకుడు రవితేజ ముల్లపూడిని పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు కానీ కేవలం v-10 చిత్రంగా పిలుస్తున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.పలువురు ప్రత్యేక అతిధుల సమక్షంలో ఈ చిత్రాన్ని నిన్నటి రోజున అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సంబంధించి నిర్మాత రామ్ తాళ్లూరి భార్య రజిని క్లబ్ కొట్టడం జరిగింది.


డైరెక్టర్ మచ్చ రవి కెమెరాను ఆన్ చేయడం జరిగింది.డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి మొదటిసారి తోని దర్శకత్వం వహించారు. దర్శకుడు నిర్మాతరం తాళ్లూరి స్క్రిప్ట్ ని అందజేయడం జరిగింది . డైరెక్టర్ నిర్మాతరం తాళ్లూరి స్క్రిప్టును సైతం అందించడం జరిగింది.ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇందులో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ మాట్లాడుతూ.. తన ఫేవరెట్ డైరెక్టర్లలో రామ్ తాళ్లూరి కూడా ఒకరని ఇది తన పదవ చిత్రం అని తెలియజేశారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది అని తెలియజేశారు విశ్వక్ సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: