టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ కథతో మూవీ యూనిట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, పవన్ తన తరువాతి ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేసిన పవన్, ఈ సినిమా షూటింగ్‌ను కూడా అతి త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.అలాగే ఈ సినిమాతో పాటు తమిళ యాక్టర్ ఇంకా డైరెక్టర్ అయిన సముద్రఖని డైరెక్షన్‌లో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలాగే మరో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా OG అనే సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు మూవీ యూనిట్ ఇప్పుడు రెడీ అవుతోంది.


అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆమెతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది.తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఈ హాట్ బ్యూటీకి, పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే అది నిజంగా ఆమెకి గొప్ప అదృష్టం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు మూవీ యూనిట్ రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: