అలనాటి అందాల తార,  లెజెండరీ నటి కాంచన ఇప్పటితరం ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అప్పట్లో ఓ పెద్ద స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో  ఎన్నో వందల చిత్రాలు చేశారు.ప్రస్తుతం ఆడపదడపా పాత్రలు చేస్తున్న కాంచన అర్జున్ రెడ్డిలో హీరో విజయ్‌ దేవరకొండకు బామ్మగా కనిపించారు. అందాల నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన కాంచన గారు తాజాగా పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్స్‌ చేశారు.తనని రాజమౌళి అవమానించారని ఆమె ఆరోపించారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కాంచన గారు మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ 'బాహుబలి' సినిమా సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంచన గారు మాట్లాడుతూ.. 'ఇక బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. ఒక రెండు రోజులు షూటింగ్‌కి నా డేట్స్‌ అడిగారు. అప్పుడు నేను రూ. 5 లక్షల పారితోషికం అడిగాను.


అయితే నాకు మాత్రం అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అని అన్నారు. అంత మొత్తం డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు' అని ఆమె వాపోయారు.ఇక తరువాత మాట్లాడుతూ.. ఐదు లక్షలు తనకు పెద్ద అమౌంట్‌ కాదని, తనలాంటి వాళ్లకు ఇస్తే సేవలు చేసుకుంటాము కదా అని కాంచన గారు పేర్కొన్నారు.. 'రాజమౌళిలాంటి పాన్ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌కి అది పెద్ద అమౌంట్‌ కాదు.ఎన్నో వందల సినిమాలు చేసిన నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ, నా లాంటి వారికి ఇస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది.ఇక అదే ముసలి హీరోలకు మాత్రం ఇస్తారా? ఇక్కడ నేను మిమల్ని విమర్శించడం లేదు. నాలాంటి ఎందరో ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేస్తున్నా' అంటూ ఆమె ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అకాడమీ అవార్డు వేడుక నేపథ్యంలో మూడు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న రాజమౌళి నాటు నాటు ఆస్కార్‌ గెలిచిన తరువాత రీసెంట్‌గా ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: