రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఒక పాటకి అవార్డు దక్కితే సంగీత దర్శకుడు క్రెడిట్ ను దక్కించుకుంటాడు.

కానీ నాటు నాటు పాట కి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గాను కీరవాణికి ఎంతటి పేరు ప్రతిష్టలు అయితే దక్కాయో అంతకు మించి దర్శకుడు రాజమౌళి కూడా పేరు పొందాడు అనడం లో సందేహం అయితే లేదు. నాటు నాటు పాట తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి మంచి పాపులారిటీ కూడా లభించింది అందుకే ఇటీవల ఆయన ను ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏకంగా 250 కోట్ల రూపాయల డీల్ తో వర్క్ చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.

రూ. 1000 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు ఆ నిర్మాణ సంస్థ ఓకే చెప్పిందని సమాచారం.ఇంగ్లీషు లో ఆయనని సినిమా తెరకెక్కించాలని కోరింది.కానీ మహేష్ బాబు తో సినిమా చేయాల్సి ఉన్న కారణంగా ప్రస్తుతానికి తాను ఏ సినిమా కి కూడా కమిట్ అవ్వలేనని రాజమౌళి హాలీవుడ్ నిర్మాణ సంస్థ యొక్క ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి రాజమౌళి స్థాయి నాటు నాటు ఆస్కార్ అవార్డు తో పది రెట్లు  అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారటా.ఇప్పుడు కాకుండా రాబోయే రోజుల్లో అయినా హాలీవుడ్ స్క్రీన్ పై రాజమౌళి యొక్క పేరు ను మనం చూడబోతున్నామని అభిమానులు కూడా చాలా ధీమా తో ఉన్నారు. మహేష్ బాబు సినిమా కి రాజమౌళి కాస్త ప్రమోషన్ చేస్తే హాలీవుడ్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో సినిమా కోసం కథ ను రెడీ చేస్తున్నట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: