టాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి హేమ, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.తనకు సంబంధించి ఓ పర్సనల్ వీడియోను సోషల్ మీడియాలో ఇంకా యూట్యూబ్‌లలో వైరల్ చేస్తున్నారంటూ హేమ తాజాగా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాల క్రితం తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను అలాగే వీడియోను అసత్య ప్రచారంతో వైరల్ చేస్తూ తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె బాగా మండిపడింది.ఇక తన ఫ్యామిలీ యానివర్సరీ వీడియోని తప్పుడు థంబ్‌నేల్స్‌తో ఇప్పుడు బాగా వైరల్ చేశారని.. ముద్ధులతో రెచ్చిపోయిన నటి హేమ అంటూ ఇష్టమొచ్చిన చెత్త రాతలు రాశారని.. తన భర్త, పిల్లలు మీడియాకు చాలా దూరంగా ఉంటారని.. ఇప్పుడు వాళ్లని కూడా ఇందులోకి లాగుతున్నారని నటి హేమ తన ఫిర్యాదులో పేర్కొంది.


అలాగే తాజాగా నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లుగా కూడా తప్పుడు వార్తలు రాశారని.. గతంలో కూడా ఇలా ఓ ప్రముఖ హీరో చనిపోయాడని, విడాకులు తీసుకున్నాడని ప్రచారాలు చేశారని.. ఇలాంటి వారిపై పోలీసులు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.కేవలం కొందరు తమ ఛానళ్ళు, వెబ్‌సైట్ల వ్యూయర్షిప్ కోసమో, బిజినెస్ కోసమో మాత్రమే ఇలా తమ ప్రైవేట్ లైఫ్‌ను డిస్టర్బ్ చేయడం అనేది అసలు ఏమాత్రం సరికాదని ఆమె తెలిపింది. గతంలో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చామని.. అమెరికా నుంచి ఓ వ్యక్తిని ఇండియాకి రప్పించగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని హేమ తెలిపింది. ఇంకా ఇప్పుడు కూడా తప్పులు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీస్‌లు హామీ ఇచ్చినట్లుగా ఆమె తెలిపింది. ఇక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే అస్సలు ఊరుకునేది లేదని.. వారి సంగతి ఖచ్చితంగా తేలుస్తానని.. నటి హేమ ఫైర్ అయ్యింది.ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా వుండే హేమ పాపం ఇలాంటి వివాదాలతో బాగా డౌన్ అయిపోయింది. ఏది ఏమైన హేమని తొక్కేసారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: