టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఇష్టం ఆయన సినిమాల్లో ఎంత మాత్రం కూడా వల్గారిటీ లేకుండా మంచి క్లీన్ గా ఉంటుంది అనే నమ్మకం జనాల్లో ఉండి పోయింది. అందుకే వెంకీ కూడా ఎప్పుడు అలాంటి సినిమాలే చేస్తూ ఉంటాడు.అయితే వెంకీ చేసిన బాడీగార్డ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.

ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలవలేకపోయింది.

డాన్ శీను సినిమాతో మంచి విజయం అందుకున్న గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేసిన ఈ బాడీ గార్డ్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మొదటగా ఈ సినిమా మలయాళం లో సిద్ధిక్ డైరెక్షన్ లో బాడీగార్డ్ అనే పేరు తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాని చూసిన వెంకటేష్ బెల్లంకొండ సురేష్ తో రీమేక్ రైట్స్ కొనేలా చేసి, తాను ఈ సినిమా చేసాడు.

అయితే ఈ సినిమా కి డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని గారిని పెట్టుకున్నారు.ఒరిజినల్ ఫ్లేవర్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గోపీచంద్ ఈ సినిమాని బాగానే డీల్ చేసారు అయినప్పటికీ ఈ సినిమా ప్లాప్ అయింది దానికి కారణం ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోని హీరోయిన్ కాకుండా ఆమె ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుంది ఇది క్లైమాక్స్ లో సినిమా చూసే ఆడియన్స్ కి తెలుస్తుంది దాంతో ఈ క్లైమాక్స్ చాలా మంది జనాలకి నచ్చలేదు. దాంతో ఈ సినిమా ప్లాప్ అయింది.ఇక ఇది ఇలా ఉంటె మళ్లీ వెంకటేష్, గోపీచంద్ కాంబో లో తొందరల్లోనే మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీర సింహ రెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న గోపిచంద్ మలినేని మళ్లీ ఒక పెద్ద హీరో తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా తరువాత వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఐతే వీళ్ళ కాంబినేషన్ హిట్ అవ్వాలని వెంకటేష్ అభిమానులుగా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: