ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీనటులో వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇందులో కొంతమంది మాత్రం సక్సెస్ అవ్వగా మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా మాస్ హీరో రవితేజ కుటుంబం నుంచి ఒక కథానాయకుడు రాబోతున్నారు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు త్వరలో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. మాధవ్ భూపతి రాజు కు సంబంధించి కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.మాధవ్ భూపతి రాజు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి పెళ్లి సందD సేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మలమంచి రవి సమర్పణ లో నవంబర్ 2న తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది .ఈ రోజున పూజ కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ ముహూర్తానికి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు క్లాప్స్ ఇవ్వడం జరిగింది. మాధవ్ భూపతి సినిమా ప్రారంభ మహోత్సవంలో ప్రముఖ డి సురేష్ బాబు, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇక రవితేజ తో కలిసి ఉన్న మాధవ్ భూపతి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.ప్రస్తుతం పూజ కార్యక్రమాలు అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసిన డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇక రవితేజ సోదరుడి కుమారులతో కలిసి పలు ఫోటోలు కూడా దిగడంతో అవి కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక దీంతో ఉన్నట్టుండి రవితేజ అభిమానులు కూడా రవితేజ కుమారుడిని ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ మేరకు మాధవ భూపతి సక్సెస్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: