ప్రపంచంలో కొంతమందికి సొంత ఊరికి ఏదోకటి చేయాలనే ఆశ ఉంటుంది.అది ఊరిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఊరి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత మంది మర్చిపోరు.తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మంది తమ ఊరి గురించి పట్టించుకుని తమ ఊరికి ఏదోకటి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.మరి ఈ లిస్టులో ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కూడా చేరిపోయారు.

మన టాలీవుడ్ లో యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని  అంటే తెలియని వారు ఉండరు.. ఈయన యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు.. ముందు నుండి యాక్షన్ ఎంటర్టైనర్స్ తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నారు. ఇక ఈ మధ్య సంక్రాంతి కానుకగా నటసింహం నందమూరి బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి''  సినిమాను తీసి మరో యాక్షన్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే దునియా విజయ్ విలన్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ లో నటించింది. ఇలాంటి విజయం తర్వాత ఈయన మరింత పాపులర్ అయ్యాడు. ఇక ప్రెజెంట్ తన నెక్స్ట్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు.ఇదిలా ఉండగా ఈయన సొంత ఊరు బొద్దులూరి వారి పాలెంలో గత కొన్నాళ్ల నుండి సరైన బస్ స్టాప్ సదుపాయం లేకపోవడంతో ఈయన ఇప్పుడు తాను పుట్టిన ఊరికి బస్సు షెల్టర్ సొంత ఖర్చుతో కట్టించి తన ఊరికి ఒక మంచి చేసాడు. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా ఈయన చేసిన సాయంకు అభినందనలు తెలుపు తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: