సినిమా పరిశ్రమ అంటేనే అదొక రంగుల ప్రపంచం ఈ ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ కి ఉన్న నేమ్ ని, ఫెమ్ ని వాడుకోవాలని చూస్తారు కానీ ఒకరు మాత్రం దీనికి పూర్తి గా బిన్నంగా ఉంటారు ఆయనే నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి.

ఈయన చేసిన సినిమాలు అప్పట్లో పెను సంచలనాలని రేకేతించాయనే చెప్పాలి.నక్సల్స్ ప్రదానం గా చేసిన ఆయన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.నక్సల్స్ సినిమాలు చేయడం ఆయనకి అలవాటు అందుకే ఆయన ఎప్పుడు కూడా ఒక పీడిత వర్గానికి చెందిన కథలతోనే సినిమాలు చేసారు. అయితే కాల క్రమేణా ఆయన సినిమాలకు ఆదరణ తగ్గిపోవడం తో ఆయన సినిమాలు చేయడం ఆపేసారు. అడపదడపా ఒకటి, రెండు సినిమాలు వచ్చిన అవి సరిగ్గా ఆడడం లేదు, అయితే ఈ మధ్య ఆయన సినిమా ఫంక్షన్స్ కి ఎక్కువ గా అటెండ్ అవుతున్నాడు.ధనుష్ హీరోగా వచ్చిన సార్ సినిమా ఫంక్షన్ కి కూడా ఆయన రావడం మనం చూసాం అలాగే వేణు డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా ఫంక్షన్ కి కూడా వచ్చాడు. ఇక రీసెంట్ గా కృష్ణ వంశీ తీసిన రంగ మార్తాండ సినిమా సెలబ్రెటీ ప్రీమియర్ కి కూడా వచ్చి ఆ సినిమా చూసి దాని గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడారు.

అయితే ఇన్ని రోజులు అసలు జనాలకి కనబడడానికే ఇంట్రెస్ట్ చూపించని నారాయణ మూర్తి ఇప్పుడు ఎందుకు అన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నాడు అనే ప్రశ్న అందరి మైండ్ లో మెదులుతుంది దానికి కారణం ఏంటంటే ఆయన నటించిన సినిమాలు ఎలాగూ రావడం లేదు కదా కనీసం తాను అయిన జనం లో ఉంటాను అని అలా ఫంక్షన్ కి వస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: