ఆర్ ఆర్ ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ సినిమా కంటే ముందు కేవలం సౌత్ లో స్టార్ హీరోగా ఉన్న తారక్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు అగ్ర నిర్మాణ సంస్థలు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ డేట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బాలీవుడ్ మీడియా అంతా కోడై కూస్తోంది. ఇంతకీ ఆ బాలీవుడ్ బడా సంస్థ మరి ఏదో కాదు? టి సిరీస్ ఫిలిమ్స్.. తాజాగా ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ అధిపతి భూషణ్ కుమార్ ఒకసారి గా తలుక్కున్న మెరవడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

దీంతో తారక్ బాలీవుడ్ మూవీ టి సిరీస్ సంస్థతో ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. నిజానికి అగ్ర నిర్మాతలు సినిమా ఈవెంట్లకు కారణం లేకుండా హాజరు కారు. తప్పకుండా తెర వెనుక వాళ్లకు సంబంధించి ఏదో ఒక డీల్ ఉండే ఉంటుంది. బహుశా టి సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్ ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించి హిందీ హక్కుల్ని సొంతం చేసుకున్నాడా? లేక ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకున్నాడో? తెలియదు కానీ ఎన్టీఆర్30  లాంచ్ లో భూషణ్ కుమార్ కనిపించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ గా మారిపోయింది. టాలీవుడ్ హీరోల్లో భూషణ్ కుమార్ ఇప్పటికే ప్రభాస్ తో ఒక సినిమా, అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో మరో సినిమాని నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ తో హిందీ గడ్డపై కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. కాబట్టి తారక్ తో కూడా ఓ ప్రాజెక్టు చేయడం పక్కా అని చెబుతున్నారు. అదే కనుక జరిగితే బాలీవుడ్ లో ఈ ప్రాజెక్టు వల్ల ఎన్టీఆర్ కి ఓ రేంజ్ లో మార్కెట్ పెరగడం ఖాయమని చెప్పవచ్చు. కాగా ఫ్యాన్స్ ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ 30 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులు హాజరయ్యారు. ఏప్రిల్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉండబోతోంది. జనతా గ్యారేజ్ వంటి కమర్షియల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొరటాలమూవీ స్క్రిప్ట్ ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: