సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే యాక్షన్ ఎపిసోడ్ లతో ప్రారంభమైంది. ఈ మూవీ లో యాక్షన్ ఎపిసోడ్ లతో పాటు ఫ్యామిలీ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ కోసం త్రివిక్రమ్ ఫ్యామిలీ కథతో కూడిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీని రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కోసం పలు టైటిల్ లను ఈ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలిసింది. తాజాగా మహేష్ 28 వ మూవీ కోసం ఈ మూవీ యూనిట్ "అమరావతికి అటు ఇటు" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఈ టైటిల్ నే దాదాపు ఈ చిత్రం బృందం ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: