మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో ఎస్ జే విలన్ పాత్ర లో నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ , అంజలి , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది .

మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియార అద్వానీ నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో వినయ విధేయ రామ అనే మూవీ రూపొందింది. ఆర్ సి 15 మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ సినిమా. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: