నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సినిమాలతో అద్భుతమైన కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాడు. ఇలా బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో అఖండ మూవీ ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.  

పూర్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ 2 డిసెంబర్ 2021 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా సూపర్ హిట్ విజయం సాధించిన ఈ మూవీ కి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు గతం లోనే బాలకృష్ణ ప్రకటించాడు.  

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సంవత్సరం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10 వ తేదీన ఈ మూవీ ని అధికారికంగా ప్రకటించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అఖండ మూవీ లో డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ "అఖండ 2" మూవీ లో కూడా డ్యూయల్ రోల్.లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: