
తనను 20 సంవత్సరాలుగా అభిమానిస్తున్న తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ తనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు కూడ కృతజ్ఞతలు తెలియచేసాడు. ఇప్పుడు ఈవిషయమే మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘ఐకాన్ స్టార్’ గా మారిపోవడంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది కాని అతడి కెరియర్ ప్రారంభంలో అతడిని అభిమానించి అతడి సినిమాలకు కలక్షన్స్ తెప్పించింది మెగా అభిమానులు మాత్రమే అంటూ కొందరు బన్నీకి గతం గుర్తు చేస్తున్నారు.
మరికొందరైతే అల్లు అర్జున్ కెరియర్ తొలిరోజులలో అతడి సినిమాల కథలను దర్శకులను ఎంపిక చేసింది అతడి మావయ్య చిరంజీవి మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి మావయ్యకు కృతజ్ఞతలు తెలియచేయవలసిన నైతిక బాధ్యత బన్నీకి లేదా అంటూ మరికొందరు మెగా ఫ్యాన్స్ బన్నీని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ ఒకసారి తన కట్టెకాలే వరకు తాను చిరంజీవి అభిమాని గానే బ్రతుకుతాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మెగా అభిమానులు బన్నీ మాటలను పూర్తిగా విశ్వసించలేక అవకాశం దొరికినప్పుడల్లా బన్నీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటారు.
లేటెస్ట్ గా జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజునాడు అల్లు అర్జున్ కనిపించకపోవడంతో పాటు అతడు కనీసం సోషల్ మీడియా ద్వారా చరణ్ కు అభినందనలు తెలియచేయక పోవడం మెగా అభిమానులకు బన్నీ పై మరింత అసహనాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి బన్నీ చరణ్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ తరుచు బన్నీ మెగా ఫ్యామిలీ పై తన అభిమానాన్ని గౌరవాన్ని చాటుకోమని మెగా ఫ్యాన్స్ నుండి పరోక్షంగా ఒత్తిడి రావడం బన్నీ కి ఊహించని తలపోటు అన్న మాటలు వినిపిస్తున్నాయి..