ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇప్పటికే ఎంపికయ్యారని అందరికి తెలుసు.ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా జాన్వీ కపూర్ హాజరయ్యారనే విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూట్ మొదలు కాగా నిన్న రాత్రి ఎన్టీఆర్ పై కొన్ని మాంటేజ్ షాట్స్ ను షూట్ చేశారని సమాచారం.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమా షూట్ మొదలైన విషయాన్ని కూడా వెల్లడించారు.

ప్రకాష్ రాజ్ మరియు శ్రీకాంత్సినిమా లో ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటీనటులకు సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.భారీ బోటు సెట్ లో ప్రస్తుతం సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సమాచారం.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా అతి త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది. కెన్నీ బేట్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారటా.

హలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం ఈ సినిమా కు మరింత ప్లస్ అవుతోందని అంటున్నారు.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృతిశెట్టి మరో హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

కృతిశెట్టి ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఎన్టీఆర్ కృతిశెట్టి జోడీ ఎంతో బాగుంటుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు జోడీగా ఛాన్స్ ఇస్తే కృతిశెట్టి కెరీర్ కు కూడా ఎంతో మేలు జరుగుతుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: