సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన విషమ అందరికి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో దేవ్ మోహన్ మరో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని గుణ టీం వర్క్స్ ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పపై నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 3D ట్రైలర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ లో నిర్మాత అయినటు వంటి దిల్ రాజు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. తాజాగా దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ నవంబర్ లోనే ఫైనల్ కాపీ రెడీ అయింది కానీ ... ఈ మూవీ ని 3 డీ లో రిలీజ్ చేయాలి అని పట్టు బట్టి ఆ కంపెనీ వాళ్లతో మాట్లాడితే 6 నెలలు సమయం పడుతుంది అన్నారు.

ఆ గ్యాప్ లో మా బడ్జెట్ ... ఇంట్రెస్ట్ అన్ని చాలా పెరిగి పోయాయి అని తాజాగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీ నే తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: