టాలీవుడ్లో అందరికి నచ్చే హీరోల్లో వెంకటేష్ ఖచ్చితంగా ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆల్ టైం ఫేవరెట్ వెంకటేష్. అలాగే అందరి హీరోలు కూడా ఎంతగానో అభిమానించే ఏకైక హీరో కూడా వెంకటేష్. ఇక వెంకీ మామ అని ముద్దుగా పిలుచుకునే వెంకటేష్ ఇప్పటికే 74 సినిమాలు పూర్తి చేసి 75వ సినిమాతో త్వరలో రాబోతున్నాడు.కెరీర్ స్టార్టింగ్ నుంచి చక్కటి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ మధ్యమధ్యలో డిఫరెంట్ పాత్రలు కూడా పోషించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. కెరీర్లో ఒక్క మచ్చ కూడా లేకుండా వున్న ఏకైక హీరో. వెంకటేష్ ని ద్వేషించే అభిమాని అసలు లేడు. అయితే ఇటీవల రానా నాయిడు సిరీస్ లో అయితే అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్ పోషించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఇక ఇదిలా ఉంటే ఇటీవలే కొన్ని రోజుల క్రితం వెంకటేష్ 75 వ సినిమాని ప్రకటించారు. హిట్, హిట్ 2 సినిమాలని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ తన 75 వ సినిమా తెరకెక్కుతుంది. 


ఈ సినిమాకి సైంధవ్ అనే టైటిల్ ని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మాస్ గ్లింప్స్ తో సినిమాపై చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి  కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఇక తాజాగా సైంధవ్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. పవిత్రమైన క్రిస్మస్ పండుగ కానుకగా 22 డిసెంబర్ 2023న సైంధవ్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.ఇంకా అలాగే రిలీజ్ డేట్ తో పాటు వెంకీ మామది ఓ మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక దీంతో వెంకటేష్ ని మరోసారి పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూడొచ్చని అభిమానులు ఇంకా ప్రేక్షకులు సైంధవ్ సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.పోస్టర్లో వెంకటేష్ మాస్ లుక్ చూస్తుంటే ఖచ్చితంగా కమల్ హాసన్ విక్రమ్ లా పెద్ద హిట్ అయ్యేట్టు కనిపిస్తుంది. విక్రమ్ రేంజ్ కి తగ్గకుండా ఈ సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: