టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెంకటేష్ హీరోగా చాలా సినిమాలు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఆయన కెరియర్ మొదట్లో మంచి స్టోరీలను ఎంచుకొని సినిమాలని తీసి చాలా మంచి హిట్లు కొట్టాడు.

బొబ్బిలి రాజా లాంటి సూపర్ హిట్ సినిమాతో వెంకటేష్ మాస్ లో కూడా మంచి హిట్ అందుకున్నాడు.ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరస హిట్లు కొడుతూ ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ అనే పేరు కూడా సంపాదించారు.అయితే వెంకటేష్ తో పాటు సమకాలీన నటుడు అయిన నాగార్జున కూడా అప్పట్లో మంచి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో మంచిపేరు సంపాదించుకున్నాడు. అప్పట్లో చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య పోటీ ఉంటే నాగార్జున, వెంకటేష్ సినిమాల మధ్య పోటీ ఉండేది.వీళ్లిద్దరూ ఒకరు లవ్ స్టోరీ చేస్తే, మరొకరు కూడా లవ్ స్టొరీ చేసేవారు ఇద్దరు కూడా సక్సెస్ కొట్టేవారు అలాగే మాస్ సినిమాలు కూడా చేశారు.

అయితే నాగార్జున చేయాల్సిన ఒక సినిమా వెంకటేష్ చేసి మంచి హిట్ కొట్టాడు అది ఏ సినిమా అంటే సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ సినిమా.నిజానికి అయితే డైరెక్టర్ సురేష్ కృష్ణ అది నాగార్జున తో చేద్దాం అని అనుకొని ఆయన్ని అప్రోచ్ అయితే ఆయన సినిమా చేద్దాం అని చెప్పారట కానీ ఆ సినిమా రోజు రోజుకి లేట్ అవ్వడం తో సురేష్ కృష్ణ వెళ్లి ఈ స్టోరీని సురేష్ బాబు కి చెబితే ఆ స్టోరీ నచ్చి సురేష్ బాబు వెంటనే వెంకటేష్ వేరే సినిమాలకి కమిట్ అయిన కూడా వాటి అన్నింటినీ అపేసి వెంటనే ఈ సినిమాని తెరకెక్కించాడు. అలా ఈ సినిమా వెంకటేష్ తో చేసి పెద్ద సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు నాగార్జున ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు.ఇక ఇది పక్కన పెడితే ప్రస్తుతం ఇద్దరు కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో చాలా బిజీ గా గడుపుతున్నారు.ప్రస్తుతం వెంకీ శైలేష్ కొలను డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు, నాగార్జున మాత్రం రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: