
ఈలోగా తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్. అందుకోసం గీతా ఆర్ట్స్ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించిందని టాక్. అల్లు అర్జున్ డ్యాన్సర్ గా ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం టైటిల్ రిజిస్టర్ చేసి సైలెంట్ గా ఉంది. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఈ సినిమా చేస్తారని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా డ్యాన్సర్ టైటిల్ కి తగినట్టుగా స్టోరీ ఉంటే అది మాత్రం వేరే రేంజ్ లో ఉంటుంది.
ఇక గీతా ఆర్ట్స్ నుంచి చిన్న సినిమాలతో పాటుగా భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య రేసులో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా బలగం లాంటి సినిమాలను ప్రోత్సహించాలని చూస్తున్నారు అల్లు అరవింద్. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన బలగం సెన్సేషనల్ హిట్ కాగా అలాంటి కథలు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగిస్తాయని ఆ కథల వేటలో ఉన్నారు గీతా ఆర్ట్స్ టీం. డ్యాన్సర్ టైటిల్ నిజంగానే అల్లు అర్జున్ తో చేస్తే మాత్రం సినిమా వీర లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఎన్.టి.ఆర్, చరణ్ లకు సరి సమానంగా అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తుంటాడు. అందుకే డ్యాన్సర్ టైటిల్ అతనికైతే పర్ఫెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్.