
అందాల ఆరబోత చేయకపోవడం కారణంగానే సాయి పల్లవిని అటు దర్శక నిర్మాతలు కూడా పక్కన పెట్టేశారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇక సాయి పల్లవి సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తుందంటూ మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే గత కొంతకాలం నుంచి ఇక సాయి పల్లవి కి సంబంధించి మరో వార్త అభిమానులను ఆకర్షిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టిన పుష్ప సినిమాకు సీక్వెల్లో సాయి పల్లవి నటిస్తుందని ఒక వార్త తెగ చక్కుర్లు కొడుతుంది.
రష్మిక పాత్ర చనిపోయిన తర్వాత ఇక సాయి పల్లవి పుష్ప జీవితంలోకి వస్తుందని. అంతేకాదు ఇక అల్లు అర్జున్తో కలిసి సాయి పల్లవి ఒక పాటలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేస్తుందంటూ వార్తలువచ్చాయి. ఇటీవల ఈ విషయంపై స్వయంగా సాయి పల్లవి స్పందించింది. పుష్ప 2 సినిమా కోసం తనను ఎవరు సంప్రదించలేదని ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పుష్ప 2లో నేను లేను. కానీ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి సినిమాలో నేను ఉన్నాను అనుకున్నందుకు అంటూ నవ్వుకుంటూ సమాధానం చెప్పింది సాయి పల్లవి. దీంతో ఇక పుష్ప సీక్వల్ లో సాయి పల్లవి కనిపించబోతుందంటూ గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో వస్తున్న వార్తలకు చెక్ పడింది.