ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయ్యి అందులో ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే మీడియం రేంజ్ హీరో లు నటించిన సినిమా లలో నైజాం ఏరియాలో మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. నిన్న అనగా మార్చి 30 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 6.78 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీ రోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన లైగర్ మూవీ మొదటి రోజు నైజం ఏరియాలో 4.26 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.


రామ్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 3.36 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. నాచురల్ స్టార్ నాని హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన "ఎం సీ ఏ" సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 3.10 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 3.06 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: