ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాలతో రూపొందుతున్న మూవీ లలో లియో మూవీ ఒకటి. ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ హీరో గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... విజయ్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీ లో తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించ బోతున్నట్లు ... ధనుష్మూవీ లో చేసే పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆయన పాత్ర ఈ మూవీ లో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు ... ఈ సినిమాకే ధనుష్ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇది ఎలా ఉంటే ఇది వరకే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో మాస్టర్ మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో లియో మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: