రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ నటించిన సినిమాలకు టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మొదటి వారం రోజుల పాటు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు వస్తూ ఉంటాయి. అలాంటి స్టార్ స్టామినా కలిగిన ప్రభాస్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది బిగినింగ్ ... బాహుబలి కంక్లూజన్ మూవీ లతో తన క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయిలో పెంచుకున్నాడు.

మూవీ లో అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ మూవీ ని శోభు యార్లగడ్డ , దేవినేని ప్రసాద్ , కె. రాఘవేంద్రరావు నిర్మించారు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... దగ్గుపాటి రానామూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ తో ప్రభాస్ కు రాజమౌళి కి రానా కు దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ గుర్తింపు లభించిందో ... ఈ నిర్మాణ సంస్థ కు కూడా అదే రేంజ్ లో గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే బాహుబలి సిరీస్ మూవీ లతో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లలో ... అంతకు మించిన మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ మరోసారి బాహుబలి నిర్మాత లతో మరో సినిమా చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. కాకపోతే ఈ నిర్మాణ సంస్థలో ప్రభాస్ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాతే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: