
ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. ఇక మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ హీరోగా రాబోయే పుష్ప 2 కూడా సూపర్ హిట్ అయితే ఇక సుకుమార్ క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇక ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హీరోగా మారిపోయిన ప్రభాస్ తో సుకుమార్ సినిమా చేస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి సుక్కు సిద్ధమయ్యాడు. కానీ లైగర్ ప్లాప్ ప్రభావం.. ఈ సినిమాపై ఉంటుంది. కాబట్టి సుక్కు ముందుకెళ్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఒకవేళ విజయ్ దేవరకొండ తో సినిమా క్యాన్సల్ అయితే మాత్రం అటు ప్రభాస్ తో సినిమాకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట సుకుమార్. ఇప్పటికే ప్రభాస్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. రంగస్థలం, పుష్ప సినిమాలకు భిన్నంగా సుకుమార్ ప్రభాస్ తో ఒక పిరియాడికల్ స్టోరీని అనుకుంటున్నాడట. రజాకర్ల ఉద్యమంలో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. అయితే పుష్ప మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య వచ్చిన చిన్న గ్యాప్ లో ఈ కథను ప్రభాస్ కు వినిపించాడట సుకుమార్. ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించడంతో.. ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇది ఎంతవరకు నిజమో ఫ్యూచర్లో తెలుస్తుంది.