ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల హవాని ఎక్కువగా కొనసాగుతోంది. ఎలాంటి ఎక్స్పెరిటేషన్ లేకుండా థియేటర్లలో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద హీరో సినిమాలలో రెమ్యూనరేషన్ అంత కూడా లేకుండానే సినిమాలు తీస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి చిన్న సినిమాలు. ఇప్పుడు మరొకసారి" మేము ఫేమస్" అనే చిన్న సినిమా రాబోతోంది. ఈనెల 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈరోజు ప్రీమియర్ షో వేయడం జరిగింది ఈ ప్రీమియర్ షో చూసిన వారంతా ఆహా అనేస్తున్నారు.


ఇలాంటి చిన్న సినిమా పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఏకంగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేయడంతో ఈ సినిమాకు మరింత హైప్ ఏర్పడుతోంది. మహేష్ బాబు ఏ సినిమాకైనా తొందరగా కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. మహేష్ బాబు తన ట్విట్టర్ నుంచి ఈ సినిమా గురించి ప్రస్తావించడం జరిగింది.. మేము ఫేమస్ సినిమా చూశానని చాలా అద్భుతంగా ఉందని ట్విట్టర్లో తెలియజేశారు.


ఇందులో నటించిన నటీనటులు డైరెక్టర్లు కూడా చాలా అద్భుతంగా తీశారని ఈ సినిమా పై పొగడ్తల వర్షం కురిపించారు.ముఖ్యంగా హీరో కం డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ టాలెంట్ కి మహేష్ కూడా ఫిదా అయిపోయారని చెప్పవచ్చు.. వాస్తవానికి ఈ సినిమా చిత్ర బృందం మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ తో ఉందని ఇక మహేష్ ట్విట్టర్ తో ఈ సినిమా మరింత డబల్ అయిందని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా మూవీ ప్రమోషన్ చాలా డిఫరెంట్ గా చేశారు ఎంతోమంది సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో మంచి హైప్ ఏర్పడుతోంది. మరి ఏ విధంగా కలెక్షన్లు రాబడతాయి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: