మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇప్పటివరకు ఆయన సినీ కెరియర్ లో దాదాపుగా 150 సినిమాలకి పైగానే నటించాడు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అంచులంచలుగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండిపోయే హీరోగా ముద్ర వేసుకున్నాడు చిరంజీవి. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి మెగా ఫోన్ పట్టారు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. 

అవును చిరంజీవి దర్శకత్వంలో ఒక సినిమా వచ్చిందని చాలామందికి తెలియకపోవచ్చు .ఇక సినిమా మరి ఏదో కాదు బిగ్ బాస్ .అయితే ఈ సినిమా మొత్తానికి ఆయనే దర్శకత్వం వహించినట్లుగా తెలుస్తోంది. కేవలం కొన్ని సన్నివేశాలను చిరంజీవిని డైరెక్టర్ చేశారట. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి రోజా జంటగా వచ్చిన ఈ మాస్ యాక్షన్ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోటా శ్రీనివాసరావు తనికెళ్ల భరణి మాధవి విజయచందర్ ఇలా చాలామంది ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలో నటించారు. గీతా ఆర్చి బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు దర్శకుడు విజయ బాపినీడు మరియు అతని స్నేహితుడు హెల్త్ బాగోలేదని కొన్ని రోజులు బయటికి వెళ్లిపోయారట. కానీ చిరంజీవికి మాత్రం అదే రోజు కాల్ షీట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆరోజు మిస్ అయితే మళ్ళీ టైం దొరకదని భావించిన చిరంజీవి ఆరోజు చేయాల్సిన సన్నివేశాలను తానే డైరెక్ట్ చేశారట .ఆరోజు ఓ ఫైట్ సీన్ తో పాటు సన్నివేశాలను కూడా స్వయంగా చిరంజీవి డైరెక్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి డైరెక్టర్ చేసిన ఏకైక సినిమా బిగ్ బాస్ కావడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: